Czech Influencer | హెలికాఫ్టర్ నుంచి డాలర్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం.. వీడియో
Czech Influencer | చెక్ రిపబ్లిక్ (Czech Republic)లోని నాడ్ లాబెమ్ (Lysa nad Labem) పట్టణంలో నోట్ల వర్షం కురిసింది. చెక్ ఇన్ఫ్లుయెన్సర్ (Czech Influencer ), టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ (Kamil Bartoshek) హెలికాఫ్టర్ (Helicopter ) ద్వారా మిలియన్ డాలర్ల (1 Million Dollars) సొమ్మును ప్రజలపై కుమ్మరించారు.
Czech Influencer | చెక్ రిపబ్లిక్ (Czech Republic)లోని నాడ్ లాబెమ్ (Lysa nad Labem) పట్టణంలో నోట్ల వర్షం కురిసింది. చెక్ ఇన్ఫ్లుయెన్సర్ (Czech Influencer ), టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ (Kamil Bartoshek) హెలికాఫ్టర్ (Helicopter ) ద్వారా మిలియన్ డాలర్ల (1 Million Dollars) సొమ్మును ప్రజలపై కుమ్మరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కమిల్ ముందుగా ఓ పోటీ నిర్వహించి అందులో గెలిచిన వారికి భారీగా సొమ్మును బహుమతిగా అందించాలనుకున్నాడు. అయితే, అతడు పెట్టిన పోటీలో ఎవరూ గెలవలేకపోయారు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించాడు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాడు. పోటీదారులందరికీ ఆ డబ్బును పంచాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో ఆదివారం ఆరుగంటలకు ఆ డబ్బును పంచుతానని పోటీదారులకు మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఆ సమయానికి రావాల్సిందిగా ఓ ప్రదేశాన్ని మెయిల్ద్వారా సమాచారం ఇచ్చాడు.
ఇక అనుకున్న సమయానికి నిర్దేశించిన ప్రాంతానికి ఓ కంటైనర్లో ఒక మిలియన్ డాలర్లను నింపుకొని వెళ్లాడు. హెలికాఫ్టర్ ద్వారా లాబెమ్ పట్టణానికి సమీపంలోని ప్రదేశంలో ఆ డబ్బును జారవిడిచాడు. అతడు జారవిడిచిన మొత్తం డబ్బు విలువ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.8 కోట్లకు పైమాటే. ఇక ఆ డబ్బుకోసం అక్కడున్న వారు పోటీపడి మీరీ దాన్ని పోగు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కమిల్.. ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
Z category Security | మాజీ ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరీ భద్రత.. షరతులు వర్తిస్తాయన్న కేంద్ర హోంశాఖ
Afghanistan | అఫ్గానిస్థాన్లో మరోసారి కంపించిన భూమి.. గత 15 రోజుల్లో ఇది నాలుగోసారి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

