Deepika Padukone | బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌వీర్‌సింగ్-దీపికా పడుకొణె (Ranveer Singh-Deepika Padukone) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగానే కాదు పలు భారీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌పరంగా కూడా ఈ దంపతులు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఐదేళ్ల క్రితం వాహబంధంతో ఈ జంట ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకూ వీరి వివాహానికి సంబంధించిన వీడియో (Wedding Video) ఒక్కటి కూడా అభిమానులతో పంచుకోలేదు. తాజాగా ఆ వీడియో తొలిసారి బయటకొచ్చింది.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారమవుతున్న ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) 8వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి ఎపిసోడ్‌కు రణ్వీర్ సింగ్ – దీపికా పదుకొణె అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను కరణ్త్ పంచుకున్నారు. ఈ క్రమంలో షో సందర్భంగా కరణ్ జోహార్.. దీపిక-రణ్వీర్ పెళ్లికి సంబంధించిన ఓ క్యూట్ వీడియోను షోలో ప్రదర్శించారు. ఓ వేడుకలో రణ్వీర్ తన ప్రేమను దీపికతో వ్యక్తపరుస్తుండటంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెహందీ వేడుక, పెళ్లి ఇలా అన్నీ ఈ వీడియోలో ఎంతో అందంగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానుల్ని, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
2013లో విడుదలైన ‘రాహ్ లీలా’ కోసం దీపిక-రణ్వీర్ తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా టైమ్‌లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. చివరికి పెద్దల అంగీకారంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
HD – 2 | deepveer wedding 🧿❤️ pic.twitter.com/zQGvgG9Jyp
— Deepika Files (@FilesDeepika) October 25, 2023
Also Read..
నా గుండె ఆనందంతో కొట్టుకుంటున్నది