స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ : మనుషులు గంటల్లో చేసే పనులను కూడా సెకండ్ల వ్యవధిలో చిట్టి (రోబో) పూర్తిచేయడం రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో చూశాం. కృత్రిమమేధ(ఏఐ), రోబోటిక్స్ విప్లవంతో ఇప్పుడు అన్ని సెక్టార్లలో వాటి వినియోగం పెరిగిపోయింది. రోబోల రాకతో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నదా? అనే చర్చ ఇటీవలి కాలంలో ఎక్కువైంది కూడా. ఈ క్రమంలో రోబోల కారణంగా ఎలాంటి ఉద్యోగాలకు ఎక్కువగా ప్రమాదమున్నదన్న అంశంపై యూకేకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఏఐ, రోబోల రాకతో రిస్క్ ఎక్కువగా ఉన్న 5 ఉద్యోగాలు
1. మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్
2. ఫైనాన్షియల్ మేనేజర్స్
3. అకౌంటెంట్స్
4. సైకాలజిస్ట్‌లు
5. పర్చేజింగ్ మేనేజర్స్
ఏఐ, రోబో వినియోగం పెరిగినప్పటికీ ప్రమాదం అంతగా లేని ఉద్యోగాలు
1. స్పోర్ట్స్ ప్లేయర్ ట్రైనింగ్
2. నిర్మాణ రంగంలోని డిజైనర్లు
3. న్యాయాధికారులు, పరిశోధకులు, ఆర్టిస్టులు