మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఎప్పుడైనా కాల్చి పడేసిన సిగరెట్ పీకలను చూశారా? చాలామంది సిగరెట్లను తాగి ఆ పీకలను రోడ్ల మీదనే పడేసి వెళ్తుంటారు. వాటిని తినే పదార్థాలు అనుకొని చాలా జంతువులు, పక్షులు వాటిని తిని అనారోగ్యం పాలు అవుతుంటాయి. అటువంటి పరిస్థితి రాకూడదని స్వీడన్‌కు చెందిన స్టార్టప్ సొడెర్టాల్జీ కాకులతో తాగిపడేసిన సిగరెట్ పీకలను ఏరిస్తోంది.
దాని కోసం ముందుగానే కాకులకు ట్రెయినింగ్ ఇప్పించి ఒక మెషిన్‌ను ఏర్పాటు చేసింది. ఆ మెషిన్‌లోకి సిగరెట్ పీకలను తీసుకొచ్చి కాకులు వేయగానే.. దానికి ప్రతిఫలంగా కాకులకు ఆహారం ఆటోమెటిక్‌గా వస్తుంది. ప్రస్తుతం చాలా కాకులు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.
స్వీడన్లో ఉండేవి కలెడోనియన్ అనే జాతికి చెందిన కాకులు. వాటికి 7 ఏళ్ల పిల్లాడికి ఉండేంత తెలివి ఉంటుందట. ఆ తెలివితోనే అవి ట్రెయినింగ్ తర్వాత టంచనుగా సిగరెట్ పీకలను ఏరుకొని వచ్చి ఆ మెషిన్లో పడేస్తున్నాయి.
Swedish enterprise Corvid Cleaning is testing a reward-based system where crows picking up cigarette butts and drop them into a trash can. Peanuts are then dispensed as a reward pic.twitter.com/3qjF2JrX0s
— Reuters (@Reuters) February 2, 2022