ఆ నగరంలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్..
డెల్టా వేరియంట్| రష్యా రాధాని మాస్కోలో డెల్డా వేరియంట్ కరోనా విజృంభిస్తున్నది. దీంతో వరుసగా రెండో రోజూ తొమ్మిది వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత రెండువారాలుగా ప్రతిరోజు మూడు వేల చొప్పున నమోదవుతున్న కేసులు ఒక్కసారిగా మూడింతలయ్యాయి.

మాస్కో: రష్యా రాధాని మాస్కోలో డెల్డా వేరియంట్ కరోనా విజృంభిస్తున్నది. దీంతో వరుసగా రెండో రోజూ తొమ్మిది వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత రెండువారాలుగా ప్రతిరోజు మూడు వేల చొప్పున నమోదవుతున్న కేసులు ఒక్కసారిగా మూడింతలయ్యాయి. శుక్రవారం 9,056 కేసులు నమోదవగా, శనివారం 9120 రికార్డయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్కు సంబంధించినవే ఉంటున్నాయని మాస్కో నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ అన్నారు.
దేశంలో గత 24 గంటల్లో 17,906 కేసులు, 466 మరణాలు నమోదయ్యాయి. అందులో మాస్కోలోనే 9 వేలకుపైగా కేసులు ఉండగా, 76 మంది మరణించారు. మార్చి 13 తర్వాత దేశంలో ఇంత పెద్దసంఖ్యలో కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే సెయింట్ పిట్స్బర్గ్లో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు. క్వార్టర్ ఫైనల్ సహా యూరో 2020 మ్యాచ్లకు సెయింట్ పిట్స్బర్గ్ ఆథిత్యం ఇవ్వనుంది. జూలై 2న మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

