అమెరికాలో మళ్లీ కాల్పులు.. పది మంది మృతి

కొలరాడో : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సోమవారం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి సహా పది మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన కొలరాడోలోని బౌల్డర్ నగరంలోని కింగ్ సూపర్ మార్కెట్ వద్ద చోటు చేసుకుంది. స్టోర్లోకి చొరబడిన నిందితుడు.. పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పలువురికి గాయాలయ్యాయని, వారిని దవాఖానకు తరలించామని చెప్పారు. సమాచారం అందుకున్న అనంతరం ఘటనాస్థలికి భారీగా చేరుకొని స్టోర్ను భద్రతా బలగాలు చుట్టుచుట్టాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అమెరికాలో వారం రోజుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. ఇటీవల జార్జియాలో మూడు స్పాలపై ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఆసియా మహిళలు మృత్యువాతపడ్డారు. అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండడం కలకలం సృష్టిస్తోంది. ఘటనపై కొలరాడో గవర్నర్ జేడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

