Cape Cobra | విమానం గాల్లో ఉండగా.. కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైన కేప్ కోబ్రా.. !
Cape Cobra | గాల్లో ఎగురుతున్న ( mid-flight) సమయంలో ఓ విమానంలోని కాక్ పిట్ (cockpit)లో అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా (Cape cobra) దర్శనమిచ్చింది. ఈ ఘటన దక్షిణాఫ్రికా (South Africa) లో సోమవారం చోటు చేసుకుంది.
Cape Cobra | గాల్లో ఎగురుతున్న ( mid-flight) సమయంలో ఓ విమానంలోని కాక్ పిట్ (cockpit)లో అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా (Cape cobra) దర్శనమిచ్చింది. ఈ ఘటన దక్షిణాఫ్రికా (South Africa) లో సోమవారం చోటు చేసుకుంది. విమానంలో పామును చూసిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.
సోమవారం ఓ తేలికపాటి విమానం వార్సెస్టర్ (Worcester ) నుంచి నెల్సుప్రీట్ (Nelspruit)కు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ (pilot) రుడోల్ఫ్ ఎరాస్మస్ (Rudolf Erasmus)కు తన వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. తల తిప్పి చూడగా.. ఓ నాగుపాము తన సీటు కింద కదులుతూ కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అయితే ఆ ఘటనతో అతను భయపడలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఈ విషయాన్ని ముందుగా గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశాడు. అనంతరం విమానాన్ని జోహన్నెస్‌బర్గ్ (Johannesburg)లో అత్యవసరంగా సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. దీంతో అధికారులు, ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది పైలట్‌ను అభినందించారు. అతని ధైర్యసాహసాలను కొనియాడారు.
కాగా, ప్రయాణానికి ముందు రోజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో వార్సెస్టర్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపామును గుర్తించినట్లు పైలట్ తెలిపారు. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. పాము ఇంజిన్ కవర్ల కింద దూరిపోయిందన్నారు. ఇంజిన్ తెరిచి చూసినా పాము కనిపించలేదని, అది వెళ్లిపోయి ఉంటుందని సిబ్బంది భావించినట్లు వివరించారు. ఇక విమానం జోహన్నెస్‌బర్గ్‌లో దిగాక కూడా పామును పట్టుకునేందుకు సిబ్బంది మరోసారి ప్రయత్నించి విఫలమయ్యారు.
Also Read..
India Corona | 5 వేలకు పైనే కొత్త కేసులు.. 25 వేలు దాటిన యాక్టివ్ కేసులు!
Adipurush | హనుమాన్ జయంతి సందర్భంగా.. ఆదిపురుష్ నుంచి హనుమంతుడి స్పెషల్ పోస్టర్..!
Kuno National Park | కూనో నేషనల్ పార్క్ నుంచి పారిపోయిన మరో చీతా..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

