Deadly Tsunamis: వేడెక్కుతున్న వెదర్.. అంటార్కిటాకాలో భీకర సునామీలు !
Deadly Tsunamis: అంటార్కిటికాలో టెంపరేచర్ వేడెక్కుతోంది. దీంతో అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఆ ఖండంలో భారీ సునామీలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు బ్రిటన్కు చెందిన ఓ యూనివర్సిటీ తన రిపోర్టులో తెలిపింది.
న్యూఢిల్లీ: అంటార్కిటికా ఖండంలో భీకర సునామీ(Deadly Tsunamis)లు రానున్నట్లు ఓ స్టడీ హెచ్చరిక చేసింది. వాతావరణ మార్పిడి వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఆ సునామీల ప్రభావం యావత్ భూగోళంపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అంటార్కిటికాలో ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. కనీసం మూడు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే, అప్పుడు అంటార్కిటికాలో భీకర స్థాయిలో సునామీలు తప్పవని స్టడీలో తెలిపారు. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ బృందం ఈ స్టడీ నిర్వహించింది.
నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ఈ స్టడీకి చెందిన రిపోర్ట్ను పబ్లిష్ చేశారు. అంటార్కిటికాలో మంచుచరియలు కూలిపోవడం వల్ల దక్షిణ ద్రువ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సునామీ ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. 2017లో రోజ్ సీ తూర్పు ప్రాంతంలో మంచుచరియిలు విరిగిపడినట్లు గుర్తించామని నిపుణులు తెలిపారు. అయితే ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగినప్పుడు అక్కడ సునామీలు వస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అంటార్కిటికాలో వాతావరణ ప్రభావం అధికంగా ఉందని, వేడి నీరు, సముద్ర మట్టం పెరగడం, ఐస్ షీట్లు కరిగిపోవడం వల్ల సునామీలు రానున్నట్లు ప్లైమౌత్ వర్సిటీ తెలిపింది.
అంటార్కిటికాలో వచ్చే సునామీ అలలు.. దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, ఆగ్నేయా ఆసియా దిశగా వెళ్తాయని అంచనా వేస్తున్నారు. అంటార్కిటాకా సునామీల వల్ల చాలా జీవాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అమేలియా షెవనెల్లి తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

