న్యూయార్క్: సిటీ గ్రూప్ భారీగా ఉద్యోగులను తొలగించనున్నది. వచ్చే రెండేండ్లలో 20 వేల మందికి ఉద్వాసన పలుకనున్నది. సంస్థ పునర్వ్యవస్థీకరణ, షేర్హోల్డర్లకు రిటర్న్ ఇవ్వాలన్న లక్ష్యంతో తాజా చర్యలు చేపట్టింది.
నాలుగో త్రైమాసికం ఫలితాల్లో భారీ నష్టాలు చవిచూసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. 2022నాటికి సంస్థలో 2,40,000 మంది ఉద్యోగులు ఉండగా, 2026నాటికి ఈ సంఖ్యను 1,80,000కు కుదించనున్నారు.