న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణం
Chris Hipkins: న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ప్రధాని జెసిండా ఆర్డ్నెన్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో.. ఆమె స్థానంలో 44 ఏళ్ల హిప్కిన్స్ బాధ్యతలు చేపట్టారు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ప్రధాని జెసిండా ఆర్డ్నెన్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో.. ఆమె స్థానంలో 44 ఏళ్ల హిప్కిన్స్ బాధ్యతలు చేపట్టారు. దేశానికి నాయకత్వం వహించే సత్తా ఇక తనలో లేదని జెసిండా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను గవర్నర్ జనరల్ సిండీ కిరో ఆమోదించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో హిప్కిన్స్ మంత్రిగా చేశారు. అప్పుడు ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు హిప్కిన్స్కు భారీ మద్దతు లభించింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న జనరల్ ఎలక్షన్స్‌లో లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే హిప్కిన్స్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం లేబర్ పార్టీకి పాపులారిటీ తగ్గినట్లు తెలుస్తోంది. బుధవారం రోజున హిప్కిన్స్ తొలి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

