CHINA FOREIGN MINISTER| నెల రోజులుగా ‘మిస్సింగ్’ అయిన విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను తొలగించిన చైనా.. కొత్త మంత్రిగా వాంగ్‌యీ
బీజింగ్: దాదాపు నెల రోజులుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను అక్కడి ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో వాంగ్ యీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించింది.
CHINA FOREIGN MINISTER| బీజింగ్: దాదాపు నెల రోజులుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను అక్కడి ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో వాంగ్ యీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించింది. చైనా అధికారిక మీడియా జిన్హువా మంగళవారం ఈ మేరకు వెల్లడించింది. చివరిసారిగా జూన్ 25న రష్యా, శ్రీలంక, వియత్నాం అధికారులతో సమావేశం సందర్భంగా కిన్ గాంగ్ కనిపించారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. జర్నలిస్ట్‌తో అఫైర్‌తో మంత్రి ఇటీవల వార్తల్లో నిలిచారు.
కిన్ గాంగ్ మిస్ అయి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆయన ఆచూకీపై స్పష్టత లేకపోవడం గమనార్హం. చైనా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించడం లేదు. మంత్రి మిస్సింగ్‌పై సోషల్ మీడియాలో చర్చించడంపైనా ప్రభుత్వం సెన్సార్ విధించింది. ‘వేర్ ఈజ్ కిన్ గాంగ్’ అని సెర్చ్ చేస్తే ‘నో రిజల్ట్స్’ అని సమాధానం వస్తున్నది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కిన్‌గాంగ్ అత్యంత సన్నిహితుడు. అధ్యక్షుడితో సాన్నిహిత్యం కారణంగానే కిన్ గాంగ్ వేగంగా ఉన్నత పదవులకు చేరుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

