Covid19 Investigation: వైరస్ ఆనవాళ్ల కోసం అమెరికా ల్యాబ్‌లో దర్యాప్తు చేపట్టరా?
Covid19 Investigation | 2019 జూలైలో.. ఫోర్ట్ డెట్రిక్కు సీడీసీ ఓ లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా.. వైరస్ పరీక్షలను నిలిపివేయాలని ఆ లేఖలో కోరింది.

బీజింగ్: కరోనా వైరస్ పుట్టుక ( Corona virus Origin ), ఆనవాళ్ల గురించి వుహాన్‌లోని ల్యాబ్ ( Wuhan Lab ) లో శాస్త్రవేత్తలు దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఎందుకు ఒక్క వుహాన్ ల్యాబ్‌నే ప్రశ్నిస్తున్నారు, వైరస్ పుట్టుక గురించి అమెరికా ల్యాబ్‌లను ఎందుకు పరిశీలించరని డ్రాగన్ దేశం చైనా ప్రశ్నిస్తున్నది. అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ ( Fort Detrick ) ఆర్మీ బేస్‌లో ఉన్న ల్యాబ్‌లో కరోనా వైరస్ ఆనవాళ్ల గురించి దర్యాప్తు చేపట్టాలని చైనీయులు డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని రాసింది. కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకైనట్లు కొన్ని దేశాలు భావిస్తున్నప్పుడు.. మరి వుహాన్‌లో కాకుండా, ఇతర దేశాల్లో ఉన్న ల్యాబ్‌లను ఎందుకు విచారించడంలేదని డబ్ల్యూహెచ్‌వో కమిటీలోని చైనా శాస్త్రవేత్త లియాంగ్ వానియన్ ప్రశ్నించారు.
అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌ను స్కాన్ చేయాలని చైనీయులు భావిస్తున్నారు. ఆ ఆర్మీ ల్యాబ్‌లో అత్యంత ప్రమాదకరమైన ఎబోలా, ఆంత్రాక్స్ వైరస్లు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 2019 జూలైలో.. ఫోర్ట్ డెట్రిక్కు సీడీసీ ఓ లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా.. వైరస్ పరీక్షలను నిలిపివేయాలని ఆ లేఖలో కోరింది. అయితే ఆ నెలలోనే వర్జీనియా ప్రాంతంలో అంతుచిక్కని శ్వాసకోస వ్యాధి కేసులు నమోదు అయ్యాయి. ఈ-సిగరేట్లతో ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని, ఎవలీ వ్యాధి వ్యాపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఫోర్ట్ డెట్రిక్ ఆర్మీ ల్యాబ్ ఉన్న మేరీల్యాండ్ రాష్ట్రంలో ఆ ఏడాది సెప్టెంబర్‌లో ఎక్కువ శాతంలో ఎవలీ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్19 తరహాలోనే ఆ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు చైనా భావిస్తున్నది.
ఫోర్ట్ డెట్రిక్లో దర్యాప్తు చేపట్టాలని ఇప్పటి వరకు 2 కోట్ల మంది ఓ లేఖపై సంతకం చేశారు. ఆ లేఖను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపనున్నారు. ఫోర్ట్ డెట్రిక్లో దర్యాప్తు ఆసక్తికరంగా కనిపిస్తున్నా.. దాని వెనుక ఉన్న రహస్యాలు బయటపడడం అసాధ్యమే అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అమెరికా ఏదైనా జీవాయుధాన్ని డెవలప్ చేయాలనుకుంటే.. కచ్చితంగా అది ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌లోనే జరుగుతుందని, జీవాయుధాన్ని తయారు చేసే కేంద్రం అదొక్కటే అని, అక్కడే సైంటిస్టులు అందరూ ఉంటారని, అక్కడే విషపదార్ధాలు ఉంటాయని బ్రౌన్ వర్సిటీ పరిశోధకుడు ఒకరు తెలిపారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూనిట్ 731 జీవాయుధ యుద్ధాన్ని కొనసాగించింది. అది ఫోర్ట్ డెట్రిక్ నుంచే కొనసాగిందని చైనా ఆరోపిస్తున్నది. అందుకే ఆ ఆర్మీ బేస్ ల్యాబ్‌లో దర్యాప్తు చేపట్టాలని చైనా విదేశాంగ శాఖ పలుమార్లు డిమాండ్ చేసింది. ఇది కేవలం వైరస్ పుట్టుక గురించే కాదు.. అన్ని దేశాల ప్రజల రక్షణ గురించి ఆ దర్యాప్తు అవసరమని చైనా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫోర్ట్ డెట్రిక్ ఆర్మీ ల్యాబ్ గురించి అమెరికా మాత్రం నోరు విప్పడం లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Covid origin
- Fort Detrick
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

