WHO: చైనా చిన్నారుల్లో నుమోనియా కేసులు.. డబ్ల్యూహెచ్‌వో ఏమన్నదంటే
WHO: చైనా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరిగాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. పిల్లల్లో నమోదు అవుతున్న నుమోనియా కేసులకు కొత్త తరహా ప్యాథోజన్‌తో కానీ, వైరస్‌తో కానీ లింకు లేదని డబ్ల్యూహెచ్‌వో ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నది.
బీజింగ్: చైనాలో ఇటీవల చిన్న పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరిగాయి. ఆ దేశంలో ఉత్తర దిక్కున ఈ కేసులు అధికంగా ఉన్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఓ ప్రకటన చేసింది. పిల్లల్లో నమోదు అవుతున్న నుమోనియా కేసులకు కొత్త తరహా ప్యాథోజన్‌తో లింకు లేదని చైనా వెల్లడించినట్లు డబ్ల్యూహెచ్‌వో ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నది. అక్టోబర్ నుంచి చైనా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నమోదు అవుతున్నట్లు డేటా ప్రకారం తెలుస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే వ్యాధులకు సంబంధించిన మరింత డేటాను ఇవ్వాలని చైనాను కోరినట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. బీజింగ్‌లో కానీ, లియానింగ్లో కానీ ఎటువంటి కొత్త ప్యాథోజెన్స్ను గుర్తించ లేదని, అయితే పిల్లల్లో నుమోనియా కేసులు పెరగడానికి సాధారణ ప్యాథోజెన్లే కారణమని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. శ్వాసకోశ కేసులు పెరిగినా, అదేమీ ఆస్పత్రులపై ప్రభావం చూపడం లేదని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Pneumonia Cases
- virus
- WHO
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

