China Covid Cases | చైనాలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు..!
China Covid Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వరుసగా ఐదో రోజు చైనాలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. ఆదివారం ఒక్కరోజే 40,347 కొవిడ్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్ వెల్లడించింది. అందులో 3,822 కేసులు వైరస్ లక్షణాలతో ఉన్నట్లు తెలిపింది. 36,525 మందికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది. ఇక చైనాలో 3,11,624 కొవిడ్ కేసులు రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా 5,232 మంది చనిపోయారు.

వైరస్ కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇందులో భాగంగా ‘జీరో కొవిడ్’ పాలసీని అమలు చేస్తూ లక్షల మంది ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాంఘై నగరంలో వేల మంది చైనీయులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కొవిడ్ లాక్‌డౌన్‌ను అంతం చేయాలని నినాదాలు చేశారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఖాళీ కాగితాలు, రాత్రిపూట మొబైల్ ఫోన్ల ఫ్లాష్లైట్లను ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. వీరికి మద్దతుగా నెటిజన్లు సైతం ఖాళీ కాగితాల చిత్రాలను పోస్టులుగా పెడుతున్నారు. ఆందోళనకారులకు చెందిన వీడియోలు ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?