తమ కొత్త అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను పంపిన చైనా

బీజింగ్: డ్రాగన్ దేశం చైనా కొత్తగా నిర్మించిన అంతరిక్ష కేంద్రానికి తన వ్యోమగాములను పంపింది. ఇవాళ ఉదయం ముగ్గురు చైనా వ్యోమగాములు నింగికెగిరారు. లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా.. షెంన్జూ12 క్యాప్సూల్‌లో ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. నీ హైషెంగ్, లయూ బోమింగ్, టాంగ్ హోంగ్బోలు.. అంతరిక్ష కేంద్రంలో మూడు నెలలు గడపనున్నారు. భూమికి 380 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తియాన్‌హీ మాడ్యూల్లో వాళ్లు ఉండనున్నారు. గోబి ఎడారిలో ఉన్న జిక్వాన్ శాటిలైట్ లాంచింగ్ కేంద్రం నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. ఈ ప్రయోగంతో చైనా అంతరిక్ష పరిశోధనల్లో తన సత్తా మరోసారి చాటింది. ఇటీవలే చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి శ్యాంపిళ్లను చైనా తీసుకువచ్చింది. కొన్ని రోజుల క్రితమే మార్స్ గ్రహంపై ఆ దేశానికి చెందిన రోబో దిగింది. రెండు అసాధారణ పరీక్షల్లో చైనా సక్సెస్ కావడం విశేషం.

షెన్‌జూ-12 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు.. అక్కడ ఉన్న తియాన్‌హీ మాడ్యూల్‌ను ఆపరేట్ చేయనున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నారు. తియాన్‌హీ సిలిండర్‌ను ఏప్రిల్‌లో చైనా ప్రయోగించింది. దాని పొడుగు 16.6 మీటర్లు.. వెడల్పు 4.2 మీటర్లు. ఆ పరికరం దాదాపు 70 టన్నులు ఉంటుంది. దాంట్లో లీవింగ్ క్వార్టర్స్, సైన్స్ ల్యాబ్స్, హబుల్ క్లాస్ టెలిస్కోప్‌లు ఉన్నాయి.
నిజానికి నింగికి ఎగిరిన ఆస్ట్రోనాట్ల గురించి చైనా చివరి నిమిషం వరకు వారి వివరాలను వెల్లడించలేదు. కేవలం ఒక రోజు ముందు మాత్రమే ఆ ముగ్గురు వ్యోమగాముల వివరాలు బయటపెట్టింది. 56 ఏళ్ల నీ హైషెంగ్.. చైనాలో ఎక్కువ అనుభవం ఉన్న ఆస్ట్రోనాట్. గతంలో రెండసార్లు అతను రోదసిలోకి వెళ్లాడు. 2013లో నీ హైషెంగ్ ప్రోటోటైప్ స్పేస్ స్టేషన్లో 15 రోజులు గడిపారు. ఇక మిగితా ఇద్దరు వ్యోమగాములకు ఎయిర్‌ఫోర్స్ అనుభవం ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

