Trump Tariffs | ట్రంప్ సుంకాలతో చైనా కుదేలు.. రోడ్డెక్కిన కార్మికులు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో చైనా కుదేలవుతున్నది. ఆ దేశ తయారీ, నిర్మాణ రంగం కుదుపునకు గురైంది. ఎగుమతులు భారీగా పడిపోవడంతో పరిశ్రమలు షట్డౌన్లు, లేఆఫ్లు ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తింది.
- తయారీ, నిర్మాణ రంగాల్లో తలెత్తిన సంక్షోభం
- తీవ్రంగా క్షీణించిన ఎగుమతులు
- ఫ్యాక్టరీల షట్డౌన్.. వేతనాల ఎగవేతలపై కార్మికుల ఆగ్రహం
Trump Tariffs | బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో చైనా కుదేలవుతున్నది. ఆ దేశ తయారీ, నిర్మాణ రంగం కుదుపునకు గురైంది. ఎగుమతులు భారీగా పడిపోవడంతో పరిశ్రమలు షట్డౌన్లు, లేఆఫ్లు ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తింది. పరిశ్రమలు కొవిడ్ తర్వాత మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో కార్మికులకు వేతనాలు కూడా చెల్లించడం లేదు. దీంతో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసనలు.. ఏప్రిల్ చివరి నాటికి తీవ్రమయ్యాయి. షాంఘై నుంచి ఇన్నర్ మంగోలియా వరకు దాదాపు అన్ని ఇండస్ట్రీ జోన్లలో కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. టోంగ్లియావో నగరంలో నిర్మాణరంగ కార్మికులు తమకు వేతనాలు చెల్లించకపోవడంపై భవనాలు ఎక్కి నిరసన వ్యక్తంచేశారు. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.
జనవరి నుంచి వేతన బకాయిలు పేరుకుపోవడంపై షాంఘైలోని ఓ ఎల్ఈడీ లైట్ల ఫ్యాక్టరీలోని వేల మంది కార్మికులు రోడ్డెక్కారు. దావో కౌంటీలో ఓ స్పోర్ట్స్ కంపెనీని ఎలాంటి సమాచారం లేకుండానే మూసేశారు. ఈ నేపథ్యంలో టారిఫ్లపై అమెరికా చర్చలకు ముందుకు వస్తుందని చైనా వాణిజ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

