బీజింగ్, నవంబర్ 12: వేదిక ఏదైనా 10 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సత్తా వింగ్ లూంగ్-3 మానవరహిత యుద్ధ విమానం సొంతమని చైనా చెప్తున్నది. గాలిలోనైనా, నీటిపైనైనా, భూమిపైనైనా, రెస్క్యూ ఆపరేషన్లలోనూ ఇది పాలుపంచుకొంటుందని తెలిపింది. జుహాయ్ ఎయిర్ షోలో భాగంగా చెంగ్డూ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ గ్రూప్ తయారుచేసిన ఈ యుద్ధ విమానాన్ని ప్రదర్శనకు ఉంచారు. 40 గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టగలదని చైనా వెల్లడించింది.