మూడేళ్ల పిల్లలకూ కరోనా వ్యాక్సిన్.. చైనా గ్రీన్‌సిగ్నల్

బీజింగ్: కరోనా వైరస్‌కు మూలమైన చైనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. మరీ ఇంత తక్కువ వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వబోతున్న తొలి దేశంగా చైనా నిలిచింది. సినోవాక్ బయోటెక్‌కు చెందిన ఈ వ్యాక్సిన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ సంస్థ చైర్మన్ యిన్ వీడాండ్ అక్కడి అధికార మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎప్పటి నుంచి పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తామన్న దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
పిల్లల్లోనూ ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు తొలి రెండు దశల ప్రాథమిక ఫలితాలు తేల్చాయి. వ్యాక్సిన్ వల్ల తీవ్ర ప్రభావాలు ఉత్పన్నమైన ఘటనలు చాలా తక్కువని న్యూస్ ఏజెన్సీ రాయ్‌టర్స్ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి అదనంగా బూస్టర్ డోసు ఇచ్చామని, దీని వల్ల వారంలో పదింతలు, 15 రోజుల్లో 20 రెట్లు యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు సినోవాక్ చైర్మన్ యిన్ వెల్లడించారు.
మూడు డోసుల పద్ధతిని కంపెనీ కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. యాంటీబాడీలు వృద్ధి చెందుతున్న తీరును పరిశీలించిన తర్వాత మూడో డోసును ఎప్పుడు ఇవ్వాలో అధికారికంగా సంస్థ సిఫారసు చేస్తుందని తెలిపారు. సినోవాక్ తర్వాత సినోఫార్మ్ కూడా పిల్లలకు అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

