Ukraine | చేతిపై ఫోన్ నెంబరుతో ఉక్రెయిన్ దాటిన చిన్నారి.. చివరకు తల్లిని చేరిన ఫొటో వైరల్
ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భయంకరంగా దాడులు చేస్తుండటంతో.. చాలా మంది ఉక్రేనియన్లు స్వదేశం విడిచి పారిపోతున్నారు. ఇలానే హసన్ పిసెకా అనే పిల్లాడు కూడా జపోరిజియా నుంచి స్లొవేకియా వెళ్లాడు. అతని చేతిలో ఒక చిన్న క్యారీబ్యాగ్, పాస్‌పోర్టు మాత్రమే ఉన్నాయి. అతని చేతిపై ఒక ఫోన్ నెంబరు రాసి ఉంది.
వాటితోనే బోర్డర్ చేరుకున్న అతన్ని అక్కడి అధికారులు బోర్డర్ దాటించారు. హసన్ చేతిపై ఉన్న నెంబరుకు ఫోన్ చేసిన తోబుట్టువుల వద్దకు చేర్చారు. అయితే హసన్ అమ్మమ్మ అనారోగ్యంతో ఉండటంతో.. ఆమెను తీసుకొని మళ్లీ వస్తానని చెప్పిన తల్లి ఉక్రెయిన్‌లోనే ఆగిపోయింది. ఆమె కోసం హసన్ ఎదురు చూశాడు.
చివరకు హసన్ తల్లి, అమ్మమ్మ కూడా ఎలాగోలా ఉక్రెయిన్ నుంచి పారిపోయి స్లొవేకియా చేరుకున్నారు. ఇప్పుడు ఆ తల్లీబిడ్డలు కలిసిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అంతకుముందు సిరియా యుద్ధం సమయంలో హసన్ కుటుంబం అక్కడి నుంచి పారిపోయింది.

ఆ సమయంలో హసన్ తండ్రి సిరియాలోనే ఉండిపోవల్సి వచ్చింది. అక్కడే తండ్రిని కోల్పోయిన హసన్.. తల్లితోనే ఉంటున్నాడు. ఈసారి కూడా ఆ కుటుంబం అంతా కోల్పోయిందని, కానీ కుటుంబంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని స్లొవేకియా అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Russia
- Slovakia
- Telugu News
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

