యూకేలో శాశ్వత నివాసానికి పదేండ్లు!
శాశ్వత నివాస నిబంధనలను యూకే కఠినతరం చేయనున్నది. ఆ దేశ హోం మంత్రి షబానా మహమూద్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. శాశ్వత నివాసానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు ప్రస్తుతం ఉన్న 5 ఏండ్ల నివాస గడువును పదేండ్లకు పెంచనున్నట్టు చెప్పారు.
లండన్ : శాశ్వత నివాస నిబంధనలను యూకే కఠినతరం చేయనున్నది. ఆ దేశ హోం మంత్రి షబానా మహమూద్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. శాశ్వత నివాసానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు ప్రస్తుతం ఉన్న 5 ఏండ్ల నివాస గడువును పదేండ్లకు పెంచనున్నట్టు చెప్పారు. మరికొన్ని విభాగాల కింద వలసదారులు శాశ్వత నివాసం కోసం 20 ఏండ్లు ఎదురుచూడాల్సి రావొచ్చు. మరోవైపు శాశ్వత నివాస అర్హత నిబంధనలను కూడా యూకే కఠినతరం చేయనున్నది.
దరఖాస్తుదారులకు ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆంగ్లభాషా నైపుణ్యం కూడా మెరుగ్గా ఉండాలి. గత మూడేండ్లుగా ఏటా 12,570 పౌండ్ల కంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉండాలి. ఫుల్‌టైమ్ ఎంప్లాయ్మెంట్ అవకాశం తక్కువగా ఉన్నవారు, శరణార్థులు, ఫ్యామిలీ వీసాదారులు, వర్క్ వీసాలపై ఆధారపడిన వారిపై ఈ కొత్త నిబంధనల ప్రభావం అధికంగా ఉండనుంది. అయితే వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా పదేండ్ల బేస్‌లైన్ మారొచ్చని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

