బీజింగ్, జూన్ 2: చంద్రుడికి ఆవలివైపు వ్యోమనౌకను పంపి అంతరిక్ష ప్రయోగాల్లో చైనా సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాకు చెందిన లూనార్ ల్యాండర్ చాంగే-6 చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ఆదివారం ప్రకటించింది.
బీజింగ్ కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 6.23 గంటలకు అయిట్కిన్ బేసిన్ పేరిట ఉన్న ప్రదేశంలో లూనార్ ల్యాండర్ సురక్షితంగా నేలను తాకినట్టు సీఎన్ఎస్ఏ తెలిపింది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీతో కూడిన చాంగే-6ను ఉపయోగించింది. ఈ మిషన్ ద్వారా అక్కడి వాతావరణంతోపాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని సైంటిస్టులు భావిస్తున్నారు.