US Iran Ceasefire | పాక్ కాదు.. సీజ్ఫైర్ డీల్ వెనుక ఉన్నది చైనా!
US Iran Ceasefire | కేవలం 10 గంటల వ్యవధిలో అమెరికా తన నిర్ణయం మార్చుకొని ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ 10 గంటల్లో ఏం జరిగింది? రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్థాన్ పాత్రే కారణమని అమెరికా పేర్కొన్నప్పటికీ చివరి నిమిషంలో చైనా జోక్యమే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసిందని తెలుస్తున్నది.
US Iran Ceasefire | న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : కేవలం 10 గంటల వ్యవధిలో అమెరికా తన నిర్ణయం మార్చుకొని ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ 10 గంటల్లో ఏం జరిగింది? రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్థాన్ పాత్రే కారణమని అమెరికా పేర్కొన్నప్పటికీ చివరి నిమిషంలో చైనా జోక్యమే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసిందని తెలుస్తున్నది.
ఇరాన్‌పై చర్చలకు ఒత్తిడి తేవడంలో చైనా ప్రమేయం ఉందా అని అడిగినపుడు అవుననే అంటున్నాను అని ట్రంప్ ఏఎఫ్‌పీతో అన్నారు. ట్రంప్ విధించిన గడువు సమీపించడం, పూర్తి స్థాయి యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చైనా నేరుగా ఇరాన్‌తో చర్చలు జరిపినట్లు ఇద్దరు చైనా అధికారులను ఉటంకిస్తూ ఏపీ వార్తాసంస్థ తెలిపింది. దీన్ని బట్టి ఇరాన్‌పై పాకిస్థాన్ కన్నా చైనాకు ప్రత్యక్ష పట్టు ఉందని తెలుస్తున్నది.
నిజానికి కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటనకు కొన్ని గంటల ముందే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి బల ప్రయోగానికి అనుమతినిచ్చే ఒక తీర్మానాన్ని చైనా, ఇరాన్‌తో మరో మిత్రదేశమైన రష్యా కలసి అడ్డుకున్నాయి. యూఎన్ తీర్మానం ఇరాన్ పట్ల వివక్షతతో కూడుకుని ఉందని చైనా పేర్కొన్నది.
పెదవి విప్పని చైనా
కాల్పుల విరమణలో తన పాత్ర గురించి చైనా ఇప్పటివరకు అధికారికంగా వ్యాఖ్యానించలేదు. చైనా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాత్రం మంగళవారం మాట్లాడుతూ విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ దేశాలతో 26 సార్లు ఫోన్లో మాట్లాడారని చెప్పారు. పశ్చిమాసియాలోని చైనా ప్రత్యేక దూత కూడా ఈ దౌత్యంలో పాల్గొన్నట్లు ఆ అధికారి తెలిపారు.
ట్రంప్ సృష్టించిన పశ్చిమాసియా గందరగోళంలోకి నేరుగా దిగకూడదనే చైనా విస్తృత వ్యూహానికి ఇది అనుగుణంగా ఉంది. కాగా చైనా మౌనం మాత్రం ప్రపంచ దృష్టిని తప్పించుకోలేకపోయింది. మీ శత్రువు తప్పు చేస్తున్నపుడు అతడికి ఎప్పుడూ అంతరాయం కలిగించవద్దు అనే శీర్షికతో వచ్చిన ది ఎకనమిస్టు మ్యాగజైన్ తాజా ముఖచిత్రం సారాంశం కూడా ఇదే. ఈ పరిణామం చోటుచేసుకున్న సమయం కూడా చాలా కీలకం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం కోసం ట్రంప్ వచ్చే నెలలో బీజింగ్ వెళ్లనున్నారు. చైనా పాత్రను ట్రంప్ ఒప్పుకున్నప్పటికీ ఆయన అధికారిక ప్రకటనలో మాత్రం దాని ప్రస్తావన లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

