UK PM Rishi Sunak | బ్రిటన్ ప్రధాని నివాసం వైపు దూసుకొచ్చిన కారు.. గేట్లను ధ్వంసం చేసి
UK PM Rishi Sunak | బ్రిటన్ ప్రధాని (UK PM) రిషి సునాక్ (Rishi Sunak ) అధికారిక నివాసమైన లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ (London 10 Downing Street ) గేటును ఓ వ్యక్తి కారు (Car)తో బలంగా ఢీ కొట్టాడు.
UK PM Rishi Sunak | బ్రిటన్ ప్రధాని (UK PM) రిషి సునాక్ (Rishi Sunak ) అధికారిక నివాసమైన లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ (London 10 Downing Street ) గేటును ఓ వ్యక్తి కారు (Car)తో బలంగా ఢీ కొట్టాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు ప్రధాని నివాసం, కార్యాలయం గేట్లను (Car crashes) ధ్వంసం చేసింది. ఊహించని ఈ పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధాని రిషి సునాక్ తన కార్యాలయంలోనే ఉన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు మరో మార్గం నుంచి ఆయన వెలుపలికి వెళ్లారు. కొద్ది సమయం వరకూ అధికారులెవరూ బయటకు రావొద్దని పోలీసులు ఆదేశించారు.
కాగా, సాధారణంగా బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఎప్పుడూ గట్టి బందోబస్తు ఉంటుంది. 1989లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్‌లో బాంబు దాడులక పాల్పడిన దృష్ట్యా ఇక్కడ భద్రతను పెంచారు. రక్షణ వ్యవస్థలో భాగంగా అక్కడ బలమైన ఇనుప గేట్లు ఏర్పాటు చేశారు. ఆ దేశ పార్లమెంట్‌కు ఇది చాలా దగ్గర మార్గం. దీంతో అక్కడ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఆ మార్గంలోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. కాగా, తాజా ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలోని వైట్ హౌస్‌వైపు ఓ ట్రక్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. భవనం బయటి సైడ్‌వాక్ నుంచి అడ్డదారిలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు శ్వేతసౌధం ఉత్తరభాగంవైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రివర్స్ డైరెక్షన్లో వెనక్కి వచ్చి మరోసారి ఢీకొట్టింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కును చుట్టుముట్టి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు తెలుగు సంతతికి చెందిన కందుల సాయివర్షిత్ (19)గా పోలీసులు గుర్తించారు. జో బైడెన్‌ను హత్య చేయాలనే లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా ట్రక్కుతో దాడికి యత్నించినట్టు నిందితుడు సాయివర్షిత్ పోలీసులకు తెలిపాడు.
Also Read..
రూ.143 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ ఖడ్గం
T-shirt | గిన్నిస్ రికార్డు.. 5 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో రగ్బీ పిచ్ అంత భారీ టీ షర్ట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

