‘కులవివక్ష’ బిల్లును తిరస్కరించిన కాలిఫోర్నియా గవర్నర్
కులవివక్ష వ్యతిరేక బిల్లును అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ తిరస్కరించారు. ఇది అనవసరమైన బిల్లు అని, కులవివక్షను నిషేధిస్తూ రాష్ట్రంలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వాషింగ్టన్, అక్టోబర్ 8: కులవివక్ష వ్యతిరేక బిల్లును అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ తిరస్కరించారు. ఇది అనవసరమైన బిల్లు అని, కులవివక్షను నిషేధిస్తూ రాష్ట్రంలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. పౌరులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ నివసిస్తున్నారు? అనేదానితో సంబంధం లేకుండా కాలిఫోర్నియాలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించేందుకు అర్హులని తాము విశ్వసిస్తామని అని గెవిన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘లింగం, జాతి, రంగు, మతం, జాతీయత పలు ఇతర అంశాల ఆధారంగా ఉండే అన్ని రకాల వివక్షను కాలిపోర్నియా ఇప్పటికే నిషేధించింది. కుల ఆధారిత వివక్షపై కూడా ఈ క్యాటగిరీల కింద నిషేధం ఉన్నది. కాబట్టి ఈ బిల్లు అవసరం లేదు’ అని అందులో స్పష్టం చేశారు. కుల వివక్ష వ్యతిరేక బిల్లును కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా, బిల్లును వీటో చేస్తూ గవర్నర్ న్యూసమ్ తీసుకొన్న నిర్ణయాన్ని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ స్వాగతించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

