బర్రెలు.. సింహాలకు ఇష్టమైన ఆహారం. బర్రెలకు చాలా మాంసం ఉండడంతో వాటిని వేటాడేందుకు సింహాలు ఇష్టపడతాయి. ఒక్కరోజు వేటాడితే ఆ మాంసాన్ని ఐదురోజుల వరకు తినొచ్చు. అయితే, బర్రెలను వేటాడడం అంత ఈజీ కాదని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ బర్రెపై దాడిచేసేందుకు వచ్చిన సింహంపై బర్రెల మంద తిరగబడ్డ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ‘ఆఫ్రికన్ వైల్డ్‌లైఫ్’ అనే పేజీ ద్వారా ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఒంటరిగా ఉన్న బర్రెపై సింహం దాడిచేసేందుకు వస్తుంది. ఇది గమనించిన మిగతా బర్రెలు ఆ సింహంపై తిరగబడతాయి. వాటి కొమ్ములతో సింహాన్ని గాల్లోకి లేపి కిందికి విసురుతాయి. దీంతో చివరికి సింహం తోకముడుస్తుంది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 89వేల వ్యూస్ వచ్చాయి.