Drones | పాక్ వైపు నుంచి అమృత్సర్ వైపు వచ్చిన డ్రోన్.. కూల్చేసిన బీఎస్ఎఫ్.. హెరాయిన్ సరఫరా చేస్తున్నట్లు గుర్తింపు
Drones | అంతర్జాతీయ సరిహద్దు దాటి మన దేశంలోకి పాకిస్థాన్ డ్రోన్లు చొచ్చుకువస్తున్నాయి. డ్రోన్లను ఉపయోగించి మత్తు మందుతోపాటు మండుగుండు సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రోన్లను కూల్చిన బీఎస్ఎఫ్ జవాన్లు..
Drones | పాకిస్థాన్ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్లు రావడం ఇటీవల నిత్యకృత్యంగా మారింది. ఇప్పటివరకు ఎన్నో డ్రోన్లను సరిహద్దు దళాలు కూల్చిశాయి. కాగా, బుధవారం అర్ధరాత్రి అమృత్సర్ వైపునకు వస్తున్న డ్రోన్‌పై బీఎస్ఎఫ్ కాల్పులు జరిపి కూల్చివేసింది. ఈ డ్రోన్ల ద్వారా మన దేశంలోకి మత్తు మందుతోపాటు మందుగుండు సామగ్రి సరఫరా చేస్తున్నట్లు సరిహద్దు దళాలు గుర్తించాయి.
సరిహద్దును దాటుకుని పాకిస్థాన్ డ్రోన్లు మన దేశంలోకి మత్తు మందుతోపాటు మందుగుండును సరఫరా చేస్తున్నాయి. సరిహద్దు దళాల కండ్లు గప్పి మరీ ఇలా విధ్వంసానికి సాయపడుతున్న పలు డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేస్తున్నారు. తాజాగా బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ వైపు నుంచి సరిహద్దు మీదుగా అమృత్సర్ వైపున బీఏపీ చన్నాకు 400 మీటర్ల దూరంలో డ్రోన్ కనిపించింది. దీనిని గుర్తించిన బీఎస్ఎఫ్ 38 రౌండ్ల కాల్పులు జరపడంతో పాటు తేలికపాటి బాంబులు వేసింది.
తొలి డ్రోన్ కనిపించిన 5 నిమిషాలకు మరో డ్రోన్ వచ్చింది. దీనిపై కూడా బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమై 13 రౌండ్ల కాల్పులు జరిపాయి. అయితే, ఈ డ్రోన్ తప్పించుకుని పాకిస్థాన్ వైపు వెళ్లిపోయింది. అనంతరం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. రత్న ఖుర్ద్ ప్రాంతంలో రెండు ఆకుపచ్చ కూల్‌డ్రింక్ బాటిళ్లలో నింపిన హెరాయిన్‌ను గుర్తించింది. రెండు బాటిళ్లలో ఉన్న 940 గ్రాముల హెరాయిన్ ఉన్నదని, దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరో చోట తుపాకీ బుల్లెట్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

