లండన్: బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్(Telegraph) దినపత్రికకు.. ఎడిటర్‌గా ఆ దేశ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశానికి చెందిన మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం టెలిగ్రాఫ్ దినపత్రిక గడ్డురోజులను గడుపుతున్నది. అయితే ఆ పత్రికను నధీమ్ జాహవి కొనుగోలు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్.. నధీమ్ జాహవితో ఎడిటర్ పోస్టు గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టెలిగ్రాఫ్ న్యూస్పేపర్లో ఓ సీనియర్ పాత్రను పోషించేందుకు బోరిస్ ఆసక్తిగా ఉన్నట్లు స్కై న్యూస్ ఓ కథనాన్ని రాసింది. అయితే దీనిపై ఇంకా అగ్రిమెంట్ జరగలేదు.
జాహవితో జాన్సన్ సంప్రదింపులు జరిపినట్లు టెలిగ్రాఫ్ సంస్థ తెలిపింది. సుమారు 20 ఏళ్ల పాటు బార్క్లే ఫ్యామిలీ టెలిగ్రాఫ్ పత్రిను నడిపింది. అయితే ప్రస్తుతం ఆ సంస్థ బాకీలు చెల్లించలేకపోతున్నది. దీంతో ఆ మీడియా ఔట్‌లెట్‌ను వేలానికి పెట్టారు. చాలా మంది కోటీశ్వరులు ఆ పత్రికను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఎడిటర్ పోస్టు విషయంలో మాత్రం జాన్సన్ ప్రతినిధి ఎటువంటి వివరణ ఇవ్వలేదు.