EARTHQUAKE| భూకంపాలను ముందే పసిగట్టొచ్చు.. ఫ్రాన్స్ శాస్త్రవేత్తల కీలక ముందడుగు
పారిస్: భూకంపాలను రెండు గంటలు ముందే పసిగట్టొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి కంటే వంద రెట్లు కచ్చితత్వంతో పనిచేసే జీపీఎస్ సెన్సార్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నదని వారు పేర్కొన్నారు.
EARTHQUAKE| పారిస్: భూకంపాలు మిగిల్చే ఆస్తి, ప్రాణనష్టం మాటల్లో చెప్పలేనిది. భూకంపాలను ముందే గుర్తిస్తే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడొచ్చు. ఈ దిశగా శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ విషయంలో కీలక ముందడుగు వేశారు. భూకంపాలను రెండు గంటలు ముందే పసిగట్టొచ్చని వారు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి కంటే వంద రెట్లు కచ్చితత్వంతో పనిచేసే జీపీఎస్ సెన్సార్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నదని వారు పేర్కొన్నారు.
క్వెంటిన్ బ్లెటెరీ, జియాన్ మాథ్యూ అనే పరిశోధకులు టెక్టోనిక్ ప్లేట్ల కదలికలకు సంబంధించిన జీపీఎస్ డాటా ఆధారంగా భూకంపాలను ముందే పసిగట్టొచ్చని పేర్కొన్నారు. 90 భూకంపాలకు సంబంధించి, 48 గంటలు ముందుగా సేకరించిన జీపీఎస్ డాటాను వారు విశ్లేషించారు. భూ కదలికల ఆధారంగా భూకంపాన్ని ముందే అంచనా వేయొచ్చని వారు పేర్కొన్నారు. అయితే ఇందుకు 0.1 మిల్లీమీటర్ పరిధిలో కదలికలను గుర్తించే జీపీఎస్ సెన్సార్లు అవసరమవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం అలాంటి సెన్సార్లు అందుబాటులో లేవని, వాటిని అభివృద్ధి చేయగలిగితే కీలక పురోగతి సాధించవచ్చని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

