Boris Johnson | 58 ఏళ్ల వయసులో.. 8వ బిడ్డకు తండ్రవుతున్న బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్
Boris Johnson | బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson ) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Boris Johnson | బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson ) 58 ఏళ్ల వయసులో ఎనిమిదో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ (carrie symonds) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరి కొన్ని వారాల్లో తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నాడంటూ ప్రకటించింది. తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను పంచుకుంది.
కాగా, 35 ఏళ్ల క్యారీ సిమండ్స్‌తో బోరిస్ కొన్నేళ్లు సహజీనం చేశాడు. అనంతరం 2021 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్ 2020లో విల్ఫ్ (Wilf) జన్మించగా.. డిసెంబర్ 2021లో రోమీ (Romy ) జన్మించాడు. ఇప్పుడు క్యారీ మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. బోరిస్‌కు ఇది మూడో వివాహం.
బోరిస్ జాన్సన్ తొలుత 1987లో కళాకారిణి, జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్ ఓవెను (Allegra Mostyn Owen) వివాహం చేసుకున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అప్పుడు వీరికి ఎలాంటి సంతానం కలగలేదు. ఆ తర్వాత 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు మెరీనా వీలర్ (Marina Wheeler)ను పెళ్లాడారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తాము విడాకులు తీసుకుంటున్నట్లు జాన్సన్-వీలర్ 2018లో ప్రకటించారు. 2020లో ఈ విడాకుల తంతు పూర్తయ్యింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ప్రకారం.. ఆర్ట్ కన్సల్టెంట్ హెలెన్ మాకిన్టైర్ ( Helen Macintyre)తో ఎఫైర్ కారణంగా బోరిస్‌కు మరో బిడ్డ ఉన్నాడు.
Also Read..
Barack Obama | ఒబామా సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం
Earthquake | పసిఫిక్ మహాసముద్రంలో వరుసగా రెండో రోజూ భారీ భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు
F-16 Fighter Jets: ఉక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపనున్న అమెరికా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

