ఇర్విన్: మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఇతర ఆరోగ్య సమస్యలతోపాటు అంధత్వం కూడా త్వరగా వస్తుందని కాలిఫోర్నియా-ఇర్విన్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. మానసిక ఒత్తిడివల్ల కంటిలోని రెటీనాలో ఉండే జీవకణాలు త్వరగా వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తాయని ఏజింగ్ సెల్ అనే జర్నల్లో ప్రచురించిన పరిశోధన వ్యాసంలో ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డొరోటా స్కొరోస్నా తెలిపారు. మనిషి శరీరంలో జీవకణాలు పుట్టుక, మరణం అనేదిక నిరంతర ప్రక్రియ అన్న విషయం తెలిసిందే.