అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ నల్లజాతి వారిపై విద్వేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక నల్లజాతి యువకుడు కారులో వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. అతన్ని వెంబడించిన పోలీసులు.. ఆ యువకుడిపై 60 సార్లు కాల్పులు జరిపారని సమాచారం. పోలీసుల బాడీ క్యామ్ వీడియో చూసిన లాయర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియోను విడుదల చేస్తామని తెలిపారు.
దీనికి సంబంధించిన పోలీసు అధికారులు ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉన్నారని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని సదరు లాయర్ తెలిపారు. జేలాండ్ వాకర్ అనే 25 సంవత్సరాల నల్లజాతి యువకుడు ఒహాయోలో కారులో వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. అతన్ని వెంబడించిన పోలీసులు 60 సార్లు కాల్పులు జరపడంతో ఆ యువకుడు మరణించినట్లు లాయర్ వెల్లడించారు.