Bitcoin: బిట్‌కాయిన్ రికార్డు.. లక్ష డాలర్లకు చేరిన క్రిప్టో విలువ
Bitcoin: బిట్‌కాయిన్ దూకుడు పెంచింది. దాని మార్కెట్ విలువ లక్ష డాలర్లు దాటేసింది. దీంతో ప్రధాన కరెన్సీగా బిట్‌కాయిన్‌ను వాడే ఛాన్సు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత క్రిప్టో పరుగులు పెడుతోంది.
న్యూయార్క్: బిట్‌కాయిన్(Bitcoin) కొత్త రికార్డు సృష్టించింది. ఆ క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ లక్ష డాలర్లకు చేరుకున్నది. అమెరికా కాబోయే అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత బెట్కాయిన్ మార్కెట్ జోరందుకున్నది. ఈ ఏడాది దాని విలువ రెండింతలు అయ్యింది. గడిచిన నాలుగు వారాల్లో ఆ కరెన్సీ విలువ 45 శాతం పెరిగింది. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ నేతల్లో క్రిప్టో కరెన్సీ అనుకూల వ్యక్తులు కూడా ఉండడం గమనార్హం.
ట్రంప్ సర్కారు క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. ప్రధాన ఆర్థిక వనరుగా బిట్‌కాయిన్ మారబోతున్నట్లు అమెరికాకు చెందిన గెలాక్సీ డిజిటల్ సంస్థ సీఈవో మైక్ నోవోగ్రాజ్ తెలిపారు. టొకెన్లు ఇవ్వడం, పేమెంట్స్ కోసం బిట్‌కాయిన్‌ను వాడే పరిస్థితులు పెరగనున్నాయి.
బిట్‌కాయిన్‌ను సృష్టించిన 16 ఏళ్ల తర్వాత.. ప్రధాన కరెన్సీగా చెలామణిలోకి రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్ విలువ లక్ష డాటర్లు దాటడం మైలురాయి అని, ఫైనాన్స్.. టెక్నాలజీ రంగంలో పెను మార్పు రానున్నట్లు హాంగ్‌కాంగ్ క్రిప్టో విశ్లేషకుడు జస్టిస్ డీఆంథెనా తెలిపారు.రాబోయే పదేళ్లలో బిట్‌కాయిన్ విలువ పది కోట్ల వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా క్రిప్టో నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

