గ్రీన్కార్డ్కు రాచబాట!

- ప్రతినిధుల సభలో ‘ఈగల్ యాక్ట్’ బిల్లు
- ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ్యులు లోఫ్గ్రెన్, కర్టిస్
- ఏడు శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్
- ఎక్కువ జనాభా దేశాలకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి
- బిల్లు గట్టెక్కితే భారతీయ ఐటీ నిపుణులకు మేలు
వాషింగ్టన్, జూన్ 3: అమెరికాలో శాశ్వత నివాసం కోసం వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రీన్‌కార్డుల జారీకి కీలక ముందడుగు పడింది. గ్రీన్‌కార్డుల జారీలో ప్రస్తుతం దేశాల వారీగా ఉన్న 7 శాతం కోటాను (కంట్రీ క్యాప్‌ను) తొలగించాలంటూ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు బుధవారం ప్రతినిధుల సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్‌కార్డుల జారీలో సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో ‘2021 ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్‌కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) యాక్ట్, 2021’ పేరిట ఈ బిల్లును కాంగ్రెస్ మహిళా సభ్యురాలు జో లోఫ్గ్రెన్, మరో కాంగ్రెస్ నేత జాన్ కర్టిస్ ప్రవేశపెట్టారు. అలాగే, కుటుంబ ఆధారిత వీసాలపై ఉన్న ప్రస్తుత 7 శాతం పరిమితినీ 15 శాతానికి పెంచాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు పాసైతే దశాబ్దాల తరబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరుగుతుంది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సెనేట్‌లో గట్టెక్కాల్సి ఉంటుంది.
ఈగల్ యాక్ట్, 2021తో భారత ఐటీ నిపుణులకు లాభమేంటి?
- 1990లో తీసుకొచ్చిన ‘కంట్రీ క్యాప్’ విధానం ద్వారా ఒక్కో దేశానికి 7 శాతం కోటా చొప్పున అమెరికా గ్రీన్‌కార్డులను జారీ చేస్తున్నది.
- ఎక్కువ జనాభా ఉన్న దేశాలకు, తక్కువ జనాభా ఉన్న దేశాలకు సమాన సంఖ్యలో గ్రీన్‌కార్డులు జారీచేస్తున్నారు. దీంతో ఎక్కువ జనాభా గల దేశాల్లోని నైపుణ్యం గలవారికి గ్రీన్‌కార్డులు రావాలంటే దశాబ్దాల సమయం పట్టేది. ఇదే సమయంలో తక్కువ జనాభా గల దేశాల్లోని నైపుణ్యంలేనివారికి త్వరగా గ్రీన్‌కార్డులు వచ్చేవి. ఈ విధానంతో ఎక్కువ జనాభా గల భారత్, చైనా దేశాలకు తీవ్రమైన నష్టం వాటిల్లేది.
- ‘కంట్రీ క్యాప్’ కోటాతో దేశాల మధ్య సమానత్వం లోపిస్తున్నదని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా మెరుగైన నైపుణ్యంగల వారు ఇతర దేశాలకు తరలిపోతున్నట్టు చెప్పారు. ఇది అమెరికా ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనవ్యక్తం చేశారు.
- తాజా బిల్లుతో ఎక్కువ జనాభాగల భారత్ వంటి దేశాలకు గ్రీన్‌కార్డుల జారీలో అగ్రతాంబూలం లభించనున్నది. దరఖాస్తుల సంఖ్య, దేశ జనాభాను పరిగణనలోకి తీసుకొని ఎక్కువ గ్రీన్‌కార్డులను జారీ చేసే అవకాశమున్నది. దీంతో అమెరికాలో శాశ్వత నివాసం కోసం భారతీయ ఐటీ నిపుణులు ఏండ్లకు ఏండ్లు నిరీక్షించాల్సిన పన్లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

