Bill Clinton | అస్వస్థతకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్..
Bill Clinton | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) క్షీణించింది. సమాచారం ప్రకారం, జ్వరంతో సహా పలు సమస్యలతో వాషింగ్టన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని మాజీ అధ్యక్షుడి డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఏంజెల్ యురేనా చెప్పినట్లు తెలుస్తున్నది.
Bill Clinton | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) క్షీణించింది. సమాచారం ప్రకారం, జ్వరంతో సహా పలు సమస్యలతో వాషింగ్టన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని మాజీ అధ్యక్షుడి డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఏంజెల్ యురేనా చెప్పినట్లు తెలుస్తున్నది. డెమొక్రాటిక్ నేత పలు వైద్య పరీక్షల కోసం మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యురేనా పేర్కొన్నారు.
ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిల్ క్లింటన్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తరఫున ఆయన ప్రచారం చేశారు. మాజీ అధ్యక్షుడు డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో సైతం ప్రసంగించారు. కమలా హారిస్‌పై క్లింటన్ ప్రశంసలు కురిపించారు. జో బిడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని వదులుకోవడం కష్టమైన నిర్ణయమంటూ ప్రశంసించారు. ట్రంప్‌పై క్లింటన్ విరుచుకుపడ్డారు. ఇక బిల్ క్లింటన్ 1993 నుంచి 2001 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2004లో బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. 2010లో కరోనరీ ఆర్టరీలో స్టెంట్లను అమర్చారు. 2021లో యూరినరీ ఇన్ఫెక్షన్తో పోరాడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

