సృజనాత్మకత అనేది మనుషులకే సొంతం అనుకుంటాం. కానీ, కొన్ని జంతువులు కూడా క్రియేటివిటీని ప్రదర్శిస్తాయి. ఓ ఎలుగుబంటి తన క్రియేటివిటీని చూపే వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అది వేసిన కలర్‌ఫుల్ పెయింటింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ‘నార్త్‌వెస్ట్ ట్రెక్ వైల్డ్‌లైఫ్ పార్కు’ తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది.
ఈ వీడియోను యూఎస్‌లోని నార్త్‌వెస్ట్ ట్రెక్ వైల్డ్‌లైఫ్ పార్కులో చిత్రీకరించారు. ఈ పార్కు 723 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులోని ‘ఫెర్న్’ అనే ఎలుగుబంటి పాదాల ముద్రలు తీసుకునేందుకు పార్కు సిబ్బంది దానిముందు కొన్ని రకాల రంగులను ఉంచారు. అయితే, అది చిత్రంగా ఆ రంగులలో పాదాలతోపాటు ముఖాన్ని ముంచి ఆనందంగా ఆడుకుంది. నేలపై అందమైన పెయింటింగ్ వేసింది. ఇదిచూసి పార్కు సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీన్ని వీడియో తీసి ఇన్‌స్టాలో ఉంచారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఆ పెయింటింగ్‌ను కాన్వాస్‌పై ఉంచి విక్రయించొచ్చని, చాలా డబ్బులు వస్తాయని నెటిజన్లు కామెంట్ చేశారు.