Visa applications | ఏడు వేల మంది పాలస్తీనియన్ల వీసా దరఖాస్తులను తిరస్కరించిన ఆస్ట్రేలియా..!
Visa applications | ఇజ్రాయెల్-గాజాల మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది పాలస్తీనీయన్లు మరణించారు. చాలా మంది శరణార్థులుగా పునరావాసం కోరుతూ పలు దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకొంటున్నారు. ఆస్ట్రేలియా వీసా కోసం కూడా పలువురు పాలస్తీనియన్లు దరఖాస్తు చేసుకున్నారు.
Visa applications : ఇజ్రాయెల్-గాజాల మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది పాలస్తీనీయన్లు మరణించారు. చాలా మంది శరణార్థులుగా పునరావాసం కోరుతూ పలు దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకొంటున్నారు. ఆస్ట్రేలియా వీసా కోసం కూడా పలువురు పాలస్తీనియన్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ దరఖాస్తులను ఆస్ట్రేలియా తిరస్కరిస్తున్నది.
పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసా కోసం చేసుకున్న దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా.. ఇజ్రాయెల్ పౌరుల వీసా దరఖాస్తులకు మాత్రం ఆమోదం తెలుపుతుండటం గమనార్హం. ఇప్పటివరకు 10 వేల మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకున్నారని ఆ దేశ హోంమంత్రి టోనీ బుర్కో పేర్కొన్నారు.
ఓ మీడియా సంస్థ కథనం ప్రకారం.. 10,033 మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 2,922 వీసాలు ఆమోదం పొందగా.. 7,111 తిరస్కరణకు గురయ్యాయి. ఇక ఇజ్రాయెల్ పౌరుల వీసా దరఖాస్తుల్లో 235 దరఖాస్తులను తిరస్కరించగా 8,646 ఆమోదం పొందాయి. ఇటీవల ఆస్ట్రేలియా సంకీర్ణ పార్లమెంటు సభ్యులు నిర్వహించిన సమావేశంలో హమాస్‌కు మద్దతు ఇవ్వటం లేదని నిర్ధారించాలనుకున్నారు.
అందుకు గాజా నుంచి వచ్చే వీసా దరఖాస్తుల పరిశీలనను కఠినతరం చేయాలని నిర్ణయించారు. అయితే పాలస్తీనియన్ల ప్రవేశం ఆస్ట్రేలియాలో జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు పీటర్ డటన్ ఆ సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

