Spain Train Crash: డ్రైవర్లు, కంట్రోల్ సెంటర్ మధ్య సంభాషణ.. ఆడియో రిలీజ్ చేసిన స్పానిష్ మీడియా
Spain Train Crash: స్పెయిన్‌లో జరిగిన రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య 69కి చేరింది. మృతులను వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్లు, కంట్రోల్ సెంటర్ల మధ్య జరిగిన సంభాషణకు చెందిన ఆడియో క్లిప్‌ను రిలీజ్ చేశారు.
మాడ్రిడ్: స్పెయిన్‌లో ఆగి ఉన్న రైలును మరో రైలు ఢీకొన్న(Spain Train Crash) ఘటనలో 68 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి చెందిన కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైలు డ్రైవర్లు, మాడ్రిడ్‌లోని రైల్వే కంట్రోల్ సెంటర్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్‌లను రిలీజ్ చేశారు. మాడ్రిడ్ నుంచి సివిల్లే వెళ్తున్న మార్గంలో ఆగి ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొన్నది. అదే ట్రాక్‌పై ముందు వెళ్లిన రైలు ఆగి ఉన్న సమయంలో మరో రైలుకు ఎలా పచ్చజెండా ఊపారాన్న దానిపై దర్యాప్తు సాగుతోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.
మాడ్రిడ్ టు సివిల్లే మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థ విఫలమైందని, ఆ సమయంలో రైల్వే కంట్రోలర్లు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రమాదం జరిగినట్లు ఆడియో రికార్డుల ద్వారా తెలుస్తోంది. స్పానిష్ మీడియా ప్రకారం సాంకేతిక సమస్య కారణంగా ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో ఆ మార్గంలో రైళ్లను అర్ధాంతరంగా ఆపేశారు. ఆగి ఉన్న రైలు ప్రైవేటు కంపెనీ ఇరియో సంస్థ రైలు కాగా, వెనుక నుంచి ఢీకొన్న రైలు ప్రభుత్వ రైల్వేది. అయితే సిగ్నలింగ్ వ్యవస్థ ఫేలైనా.. వెనుక ఉన్న రైలుకు స్పీడ్ ఆంక్షలు విధించలేదని రికార్డులు ద్వారా తెలిసింది. టెక్నికల్ సమస్యలు ఉన్నా.. సాధారణ స్పీడ్‌లోనే వెళ్లాలని వెనుక ఉన్న రెనిఫ్ రైలు డ్రైవర్‌కు కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.
ముందు ఆగి ఉన్న ఇరియో సంస్థ రైలుకు కమ్యూనికేషన్ తెగిపోయింది. కంట్రోల్ సిస్టమ్ కూడా పనిచేయలేదు. దీంతో ఆ రైలును ఉర్దా గ్రామంలో ఆపేశారు. ముందుకు సాగాలని ఇరియో రైలుకు ఆదేశాలు ఉన్నా.. సేఫ్టీ వ్యవస్థలో లోపం వల్ల ఆ రైలు సాధారణ స్పీడ్‌లో వెళ్లలేకపోయింది. రైలు సెక్యూర్టీ సిస్టమ్ గురించి కంట్రోల్ సెంటర్‌కు డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. ఇరియో రైలు ఆగి పోయిన విషయం కంట్రోల్ సెంటర్‌కు తెలుసు అని, కానీ వెనుక వస్తున్న రెనిఫ్ రైలుకు మాత్రం ఆ సమాచారం అందలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. వెనుక వస్తున్న రెనిఫ్ రైలులో 397 మంది, ఆగి ఉన్న ఇరియో రైలులో 147 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రస్తుతం మృతుల సంఖ్య 69కి చేరింది. బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మృతులకు చెందిన సంబంధిత వ్యక్తులు డీఎన్ఏ శ్యాంపిళ్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. సుమారు 900 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రక్తదానం చేయాలని ప్రజల్ని అధికారులు వేడుకున్నారు. దేశమంతా విషాదంలో నిండినట్లు ప్రధాని సాంచేజ్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spain Train Crash: డ్రైవర్లు, కంట్రోల్ సెంటర్ మధ్య సంభాషణ.. ఆడియో రిలీజ్ చేసిన స్పానిష్ మీడియా
Anirudh – Kaviya | అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్.. ప్రధాని, సీఎం విజయ్ సహా ప్రముఖులకు ఆహ్వానం!
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

