లెస్టర్‌లో ఆలయం ధ్వంసం!
యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్‌లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. తాజాగా నగరంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి
లండన్, సెప్టెంబర్ 19: యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్‌లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. తాజాగా నగరంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తూర్పు ఇంగ్లండ్ నగరమైన లెస్టర్‌లోని ఓ ఆలయ పరిసరాలు ధ్వంసమయ్యాయని, భారతీయ సమాజంపై జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు లండన్‌లోని భారత్ హైకమిషన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూకే అధికారులను కోరినట్టు తెలిపింది. నగరంలోని మెల్టాన్ రోడ్లో ఉన్న మతపరమైన ప్రాంతం వద్ద జెండా కూల్చివేత ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి 15 మందిని అరెస్టు చేశారు. ఓ వైపు ‘జై శ్రీరామ్’ నినాదాలతో హిందూ గ్రూపులు ఆందోళన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదే సమయంలో ఈ గ్రూపులు లెస్టర్ ముస్లింలకు చెందిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయని అవతలి గ్రూపు ఆరోపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

