వర్షం ధాటికి ఏడుగురు మృతి.. ఇద్దరు గల్లంతు..!
Rian in Pakisthan: పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రావిన్స్‌లోని కాచి, హర్నాయ్, పిషిన్, ఖుజ్దార్, కెచ్ అండ్ పంజ్గూర్ జిల్లాలు

క్వెట్టా: పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రావిన్స్‌లోని కాచి, హర్నాయ్, పిషిన్, ఖుజ్దార్, కెచ్ అండ్ పంజ్గూర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ వర్షాలవల్ల వరదలు పోటెత్తి ఏడుగురిని బలితీసుకున్నాయి. మరో ఇద్దరు గల్లంతయ్యారు. బోస్టెన్ తహసీల్‌లోని కిల్లీ రేగి ఏరియాలో ఇల్లు కూలి తండ్రి, నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
కెచ్‌లో ఉప్పొంగి ప్రవహిస్తున్న ముర్గ్ అబ్ నదిలో 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక వ్యాన్ కొట్టుకుపోయింది. వెంటనే రంగంలోకి దిగిన రక్షణ సిబ్బంది ఏడుగురిని ప్రాణాలతో వెలికితీశారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. అదేవిధంగా వరదల ధాటికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోవడంతో ప్రావిన్స్‌లోని వివిధ పట్టణాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

