Mexico Bus Accident | మెక్సికోలో హైవేపై నుంచి లోయలో పడ్డ బస్సు.. 17 మంది మృతి.. బాధితుల్లో ఆరుగురు భారతీయులు!
Mexico Bus Accident | మెక్సికోలోని నయారిట్ రాష్ట్ర రాజధాని టెపిక్ సమీపంలో ఓ బస్సు హైవే నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్నవారంతా వలసదారులేనని.. వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Mexico Bus Accident | మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్ రాష్ట్ర రాజధాని టెపిక్ సమీపంలో ఓ బస్సు హైవే నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్నవారంతా వలసదారులేనని.. వీరిలో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక కాలమాన ప్రకారం గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం గురించి తెలియగానే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెస్క్యూ ఆపరేషన్ చాలా క్లిష్టంగా సాగాయని సహాయక సిబ్బంది వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా, ఇటీవల మెక్సికోలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. గత నెలలో ఓక్సాకాలో అదుపుతప్పి ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరిలో సెంట్రల్ మెక్సికోలో క్రాసింగ్ వద్ద వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

