లండన్: ఆస్ట్రాజెనికా టీకాను బూస్టర్‌గా తీసుకుంటే అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు ట్రయల్స్ డేటా ద్వారా తెలుస్తోంది. ఆస్ట్రాజెనికా కంపెనీ వాక్స్జెవెరియా పేరుతో టీకాలను యూరోప్‌లో వాడుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పాటు బీటా, డెల్టా, ఆల్ఫా, గామా వేరియంట్లకు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు ప్రాథమిక డేటా అంచనా వేసింది. గతంలో వాక్స్జెవెరియా లేదా ఎంఆర్ఎన్ఏ టీకాలు వేసుకున్న వారిలో ఆస్ట్రాజెనికా బూస్టర్‌తో అధిక స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు తేల్చారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దూసుకెళ్తున్న నేపథ్యంలో.. మూడు డోసుల వాక్స్జెవెరియా కీలకంగా పనిచేస్తున్నట్లు ఆస్ట్రాజెనికా తెలిపింది. ట్రయల్స్ ఆధారంగా ఈ డేటాను రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. మూడు డోసుల వాక్స్జెవెరియాతో ఇమ్యూనిటీ అధికంగా ఉన్నట్లు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ చీఫ్ ఆండ్రూ పొల్లార్డ్ ఓ ప్రకటనలో తెలిపారు.