Aruna Miller | మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్.. ఈ పదవి చేపట్టిన తొలి ఇండియన్-అమెరికన్
మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఇండియన్-అమెరికన్ అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు. అరుణ హైదరాబాద్‌లో జన్మించి తండ్రితో అమెరికా వెళ్లారు.
Aruna Miller | అమెరికాలోని మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు. భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్-అమెరికన్‌గా అరుణా మిల్లర్ అమెరికాలో చరిత్ర సృష్టించారు.
అరుణా మిల్లర్ మేరీల్యాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్. ఆమె 2010 నుంచి 2018 వరకు మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో కూడా పనిచేశారు. అక్కడ రెండు పదవీకాలాన్ని పూర్తి చేశారు. భారతీయ-అమెరికన్లలో అరుణకు మంచి పేరున్నది. లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికలో చాలా మంది ట్రంప్ మద్దతుదారులు ఆమెకు మద్దతు ఇచ్చారు. కాగా, మేరీల్యాండ్‌లో నల్లజాతీయులు మూడు ఉన్నత స్థానాలకు ఎన్నికయ్యారు. వెస్ మూర్ గవర్నర్‌గా.. అరుణ లెఫ్టినెంట్ గవర్నర్‌గా, ఆంథోనీ బ్రౌన్ లెఫ్టినెంట్ జనరల్‌గా ఎన్నికయ్యారు.
హైదరాబాద్‌లో జన్మించిన 58 ఏండ్ల అరుణ.. 1972 లో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లింది. 2000 సంవత్సరంలో అమెకు అమెరికా పౌరసత్వం లభించింది. అరుణ వృత్తి రీత్యా కెరియర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్. మేరీల్యాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో 25 సంవత్సరాలు పనిచేశారు. అరుణ తండ్రి కూడా మెకానికల్ ఇంజినీర్. 1972లో అరుణకు ఏడేండ్ల వయసులో భార్య, ముగ్గురు పిల్లలను తీసుకుని అమెరికా వెళ్లాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

