Unique Masks | ఇది కరోనా కాలం. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఖచ్చితంగా మూతికి మాస్క్ ధరించాల్సిందే. బయట అడుగు పడింది అంటే.. ముఖానికి మాస్క్ ఉండాల్సిందే. భవిష్యత్తులోనూ మాస్క్ లేని జీవితాన్ని ఊహిస్తామో లేదో.. ప్రస్తుతానికైతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మాస్క్ మాత్రం ఖచ్చితంగా ధరించాల్సిందే.
అయితే.. మార్కెట్లోకి పలు రకాల డిజైన్లతో అందరినీ ఆకర్షించేలా మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. కానీ.. ఈ మాస్క్ మాత్రం వెరైటీ మాస్క్. మామూలు వెరైటీ మాస్క్ కాదు. ఇప్పటి వరకు ఇటువంటి మస్క్‌ను ఎవరూ తయారు చేసి ఉండరు. అందుకే వీటిని యూనిక్ మాస్క్లని అంటున్నారు.
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఇటువంటి మాస్కులను చూసి ఉంటారు. మీరు పైన ఫోటోలో చూస్తున్న మాస్కులు అవే. ఈ యూనిక్ మాస్క్‌లను ఉక్రెయిన్‌కు చెందిన మిట్రీ బ్రాగిన్ అనే ఆర్టిస్ట్ తయారు చేశాడు. ఈ మాస్క్ వేసుకుంటే సూపర్ హీరోలా కనిపిస్తారు. కాకపోతే ఇది ముఖం మొత్తాన్ని కవర్ చేస్తుంది. పలు యంత్రాలలో వాడే పనిముట్లతో పలు రకాల మాస్క్‌లను బ్రాగిన్ తయారు చేశాడు. వీటినే స్టీమ్పంక్ డిజైన్స్ అంటారు. 19వ శతాబ్దంలో స్టీమ్ ఆధారిత మిషినరీని ఉపయోగించేవారు. దాని నుంచి స్ఫూర్తి పొంది ఈ ఆర్టిస్ట్ ఇటువంటి మాస్క్‌లను తయారు చేశాడు.
ఈ మాస్క్‌లను తయారు చేసిన తర్వాత వాటిని తన ఇన్‌స్టా అకౌంట్లో బ్రాగిన్ షేర్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనానే కాదు.. కరోనా తాత వైరస్‌ను కూడా ఈ మాస్క్‌లు తరిమికొట్టేలా ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.