టోక్యో, ఆగస్టు 18 : జపాన్ వైద్య నిపుణులు ఛాతీ ఎక్స్‌రేతో మానవుల వయసును అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మాడల్‌ను అభివృద్ధి చేశారు. ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని తయారు చేశారు. 2008 నుంచి 2021 మధ్య తీసిన ఆరోగ్యవంతుల 67 వేల రేడియోగ్రాఫ్‌లు, వ్యాధులతో బాధపడుతున్న వారి 37 వేల రేడియోగ్రాఫ్లను వినియోగించి పరిశోధకులు ఏఐ మాడల్‌కు శిక్షణ అందించారు.
వాటి ఆధారంగా ఏఐ మాడల్ వయసు నిర్ధారణలో పురోగతి సాధించినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ ఏఐ మోడల్ ఛాతీ ఎక్స్‌రేలను వినియోగించి హైపర్‌టెన్షన్, ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడంలో పురోగతి సాధించిందని వారు తెలిపారు.