ఆర్టెమిస్ రాకెట్‌ను ఇవాళ మరోసారి ప్రయోగించనున్న నాసా
ఫ్లోరిడా: చంద్రుడిపైకి వెళ్లే ఆర్టెమిస్-1 రాకెట్‌ను ఇవాళ నాసా మళ్లీ ప్రయోగించనున్నది. గత సోమవారం జరగాల్సిన ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్) రాకెట్‌ను నాసా ప్రయోగిస్తోంది. దీనితో పాటు ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా నాసా నింగిలోకి పంపనున్నది. ప్రస్తుతం కెన్నడీ స్పేస్ సెంటర్ వద్ద పాజిటివ్ మూడ్ ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం స్థానికల కాలమానం ప్రకారం మధ్యాహ్నం 14.17 నిమిషాలకు ప్రయోగం జరగనున్నది.
ఆర్టెమిస్-1 ప్రాజెక్టు ప్రధాన టార్గెట్ ఓరియన్ సిస్టమ్‌ను పరీక్షించడమే. అంతరిక్ష వాతావరణంలో ఎలా ఓరియన్ క్యాప్సూల్స్ పనిచేస్తోందో నాసా టెస్ట్ చేయనున్నది. వ్యోమగాములను మోసుకువెళ్లే ఓరియన్ క్యాప్సూల్ ఎలా రీ ఎంట్రీ ఇస్తుంది, కిందకు ఎలా దిగుతుంది, రికవరీ ఎలా ఉంటుందో నాసా టెస్ట్ చేయనున్నది. వ్యోమగాములతో కూడిన ఆర్టెమిస్-2 ప్రాజెక్టు 2024లో నింగిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

