చందమామ చెంతకు ఆర్టెమిస్-2.. నేడు తిరుగు ప్రయాణం.. 10న ల్యాండింగ్
దాదాపు 53 ఏండ్ల తరువాత మానవులు మరోసారి జాబిల్లి చెంతకు చేరారు. గత అర్ధశతాబ్ద కాలంలో అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ప్రతి మానవుడూ విశ్వపు ఉపరితలాన్ని స్పృశించి వచ్చాడు తప్ప, అది దాటి అవతలికి వెళ్లలేదు.
న్యూఢిల్లీ: దాదాపు 53 ఏండ్ల తరువాత మానవులు మరోసారి జాబిల్లి చెంతకు చేరారు. గత అర్ధశతాబ్ద కాలంలో అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ప్రతి మానవుడూ విశ్వపు ఉపరితలాన్ని స్పృశించి వచ్చాడు తప్ప, అది దాటి అవతలికి వెళ్లలేదు. కానీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్రలో నలుగురు వ్యోమగాములు చంద్రుడి సమీపానికి చేరారు. వారిని తీసుకెళ్లిన ఓరియన్ వ్యోమనౌక ఈ నెల 6న 4,06,773 కిలోమీటర్లు ప్రయాణించి అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా రికార్డు సృష్టించింది.
ఇంతకుముందు 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డు కంటే ఇది 2,500 కిలోమీటర్లు అదనం. వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం ఈ నెల 7న అర్ధరాత్రి 12:15కు చంద్రుడి సమీపం నుంచి తిరుగు ప్రయాణం కానున్నది. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భూకక్ష్యలో 400 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చంద్రుడు భూమికి 3,84,633 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇంతకుముందు అపోలో-13 4,00,171 కిలోమీటర్ల దూరం ప్రయాణించగా, ఆర్టెమిస్-2 మరో 2,500 కిలోమీటర్ల దూరం ఎక్కువగా ప్రయాణించనుంది. చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తిచేశాక వ్యోమనౌక ఈ నెల 10న పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్ కావచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

