Apple Watches: స్మార్ట్ వాచీల అమ్మకాలపై బ్యాన్.. కోర్టుకెక్కిన యాపిల్ కంపెనీ
Apple Watches: మాసిమో కంపెనీ ఆరోపణలతో.. యాపిల్ సంస్థ వాచీల అమ్మకాలు, దిగుమతిపై అమెరికాలో నిషేధం విధించారు. దీంతో ఆ కంపెనీ ఇవాళ కోర్టును ఆశ్రయించింది. పల్స్ ఆక్సీమీటర్ టెక్నాలజీని యాపిల్ సంస్థ దొంగలించినట్లు యాపిల్ సంస్థపై మాసిమో కంపెనీ ఆరోపణలు చేసింది.
వాషింగ్టన్: అమెరికాలో యాపిల్ వాచీల(Apple Watches) అమ్మకాలపై బైడెన్ సర్కార్ నిషేధం విధించింది. వాచీల పేటెంట్ విషయంలో మెడికల్ మానిటరింగ్ టెక్నాలజీ కంపెనీ మాసిమో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యాపిల్ వాచీల దిగుమతిని అడ్డుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇవాళ యాపిల్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. వాచీల దిగుమతి, అమ్మకాలపై నిషేధాన్ని ఆపాలని అప్పీల్స్ కోర్టులో యాపిల్ సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. సిరీస్ 9, ఆల్ట్రా 2 వాచీల అమ్మకాలు, దిగుమతిపై బ్యాన్‌ను ఎత్తివేసేందుకు వైట్‌హౌజ్ నిరాకరించిన విషయం తెలిసిందే. డివైస్ మేకర్ మాసిమో కంపెనీకి చెందిన టెక్నాలజీ, స్టాఫ్‌తోనే యాపిల్ సంస్థ వాచీలు తయారు చేసినట్లు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య సంఘం యాపిల్ సంస్థపై చర్యలు తీసుకున్నది. ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ ఇచ్చిన తీర్పును యాపిల్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ ఉద్యోగుల్ని యాపిల్ కంపెనీ కిరాయి తీసుకున్నదని, పల్స్ ఆక్సీమీటర్ టెక్నాలజీని దొంగలించారని, ఆ టెక్నాలజీని యాపిల్ వాచీలో వాడారని మాసిమో కంపెనీ ఆరోపిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

