Alaska Aircraft | అలాస్కాలో విమాన ప్రమాదం.. పైలట్ సహా పది మంది మృతి..!
Alaska Aircraft | పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా మొత్తం పది మంది మరణించారు. విమాన శిథిలాలను సముద్రంలో గుర్తించారు. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర్నో మాట్లాడుతూ రెస్క్యూ వర్కర్స్ విమానం కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Alaska Aircraft | పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా మొత్తం పది మంది మరణించారు. విమాన శిథిలాలను సముద్రంలో గుర్తించారు. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర్నో మాట్లాడుతూ రెస్క్యూ వర్కర్స్ విమానం కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. విమానం టేకాఫ్ అయిన గంటలోపే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం.. బెరింగ్ ఎయిర్ సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం గురువారం మధ్యాహ్నం తొమ్మిది మంది ప్రయాణికులు, పైలట్‌తో ఉనల్కలేట్ నుంచి బయలుదేరింది.
డేవిడ్ ఓల్సన్, బేరింగ్ ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్, సెస్నా కారవాన్ ఉనల్కట్ నుంచి మధ్యాహ్నం 2.37 గంటలకు బయలుదేరింది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. అక్కడ తేలికపాటి హిమపాతం, పొగమంచు ఉన్నది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కోస్ట్ గార్డ్ లెఫ్టినెంట్ కమాండర్ బెంజమిన్ మెక్‌ఇంటైర్ కోబుల్ మాట్లాడుతూ.. విమానానికి ఏం జరిగిందో తాను ఊహించలేనని.. విమానం నుంచి ఎలాంటి డిస్ట్రెస్ సిగ్నల్ గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. విమానాల్లో అత్యవసర లొకేటింగ్ ట్రాన్స్మిటర్ ఉంటుందని.. విమానానికి ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు ఆ పరికరం ఉపగ్రహానికి ఓ సంకేతాన్ని పంపుతుందని.. ఆ తర్వాత ఆ సందేశాన్ని కోస్ట్‌గార్డ్‌కు పంపుతుందని.. అయితే, ఈ ఘటనలో కోస్ట్‌గార్డ్‌కు ఎలాంటి ప్రమాదం రాలేదన్నారు.
బెరింగ్ ఎయిర్ పశ్చిమ అలాస్కాలోని 32 గ్రామాలకు నోమ్, కోట్జెబ్యూ, ఉనల్కలేట్ హబ్‌ల నుంచి సేవలు అందిస్తుంది. ఇదిలా ఉండగా జనవరి 29న అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొనడంతో 67 మంది ప్రయాణానికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జనవరి 31 న ఫిలడెల్ఫియాలో రవాణా విమానం కూలగా.. ఆరురుగు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అలాస్కా విమాన ప్రమాదంలో పది మంది మరణించారు. అమెరికాలో గత ఎనిమిది రోజుల్లో జరిగిన మూడు విమాన ప్రమాదాల్లో దాదాపు 84 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

