టీకా పొందని సిబ్బందిని సస్పెండ్ చేసిన ఎయిర్ కెనడా

ఒట్టావా: కరోనా టీకా తీసుకోని సుమారు 800 మందికిపైగా సిబ్బందిని ఎయిర్ కెనడా సస్పెండ్ చేసింది. కరోనా కొత్త నిబంధనల మేరకు ఆ సంస్థ ఈ చర్యలు చేపట్టినట్లు గ్లోబల్ న్యూస్ వార్తా సంస్థ బుధవారం పేర్కొంది. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కరోనా నియంత్రణకు గత నెలలో ఒక ఉత్తర్వు జారీ చేశారు. అక్టోబర్ 30 నాటికి తమ కార్మికులకు టీకా విధానాలను ఏర్పాటు చేయాలని ఎయిర్, రైలు, షిప్పింగ్ కంపెనీలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ కోసం పలు చర్యలు చేపట్టాయి.
కాగా, ఎయిర్ కెనడాకు చెందిన 27,000 మంది కేబిన్ క్రూ, కస్టమర్ సర్వీస్ ఏజెంట్లు, ఇతర సిబ్బంది టీకా రెండు డోసులు తీసుకున్నట్లు ఆ సంస్థ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైఖేల్ రస్సో తెలిపారు. 96 శాతం మందికిపైగా సిబ్బంది పూర్తిగా టీకాలు పొందారని చెప్పారు. అయితే టీకాలు తీసుకోని, వైద్య లేదా ఇతర మినహాయింపు అనుమతి లేని ఉద్యోగులను వేతనం లేని సెలవులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

