జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా సర్కార్ స్వస్తిక్ గుర్తుపై నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఓ అంతిమ నిర్ణయమంటూ ఏదీ తీసుకోలేదు గానీ… నిషేధ విధించే దిశగానే అడుగులు పడుతున్నట్లు ద్యోతకమవుతోంది. న్యూడెమోక్రెటిక్ పార్టీ ఎంపీ జగ్మీత్ సింగ్ స్వస్తిక్ గుర్తు వాడకాన్ని నిషేధించాలంటూ పార్లమెంట్లో ఓ బిల్లు తీసుకురావడంతో ఈ వివాదం మొదలైంది. అయితే హిందువులు వాడే స్వస్తిక్ చిహ్నాన్ని, హకెన్ క్రూజ్‌తో కలపొద్దని అమెరికా లో ఉన్న హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ హకెన్ క్రూజ్‌ని 20 వ శతాబ్దంలో నాజీలు ఉపయోగించారని, అది కూడా హిందువులు వాడే స్వస్తిక్ చిహ్న లాగే ఉంటుందని పేర్కొంటోంది. ఈ రెండింటి మధ్యా హస్తిమశకాంతం తేడా ఉందని అమెరికా నేతృత్వంలోని హిందూ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
ట్రక్కు డ్రైవర్లకు వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా ట్రక్కు డ్రైవర్లు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీనికి ప్రజలు కూడా తోడయ్యారు. ఈ ఆందోళలో నిరసనకారులు స్వస్తిక్ గుర్తు ఉన్న జెండాలు, కాన్ఫరెట్ జెండా (ఇది కూడా స్వస్తిక్ గుర్తును పోలి ఉంటుంది) వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన తర్వాత న్యూ డెమొక్రెటిక్ పార్టీ ఎంపీ జగ్మీత్ సింగ్ ఓ ట్వీట్ చేస్తూ… స్వస్తిక్ జెండాలను, కాన్ఫిడరేట్ జెండాలను నిషేధించే సమయం. వీటికి స్థానం లేదు. ద్వేషపూరిత చిహ్నాలను నిషేధించాలి. సమాజంలో విద్వేషాలకు స్థానం లేకుండా చూసుకోవాలి అంటూ జగ్మీత్ సింగ్ ట్వీట్ చేశారు.
దీనిపై హిందూఫ్యాక్ట్ (హిందూ పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వోకసీ కలెక్టివ్) అనే సంస్థ స్పందించింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులతో పాటు మిగా వారూ కొన్ని తరాలుగా శుభానికి సంకేతకంగా ఈ స్వస్తిక్‌ను వాడుతున్నారని కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ స్వస్తిక్‌ను హకెన్క్రేజ్ తో కలిపి చూడొద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఈ రెండు స్వస్తిక్ గుర్తుల విషయంలో జస్టిన్ క్రూడో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లు మరికొందరు భావిస్తున్నారు. ఈ రెండు గుర్తుల విషయంలో కెనడా ప్రభుత్వం ఊగిసలాటలో పడిపోయిందని అంటున్నారు.